TLCA: టిఎల్‌సిఎ అధ్యక్షుడిగా సుమంత్ రామ్ శెట్టి
 
                                    న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) నూతన అధ్యక్షుడిగా సుమంత్ రామ్ శెట్టి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమంత్ రామ్ మాట్లాడుతూ, తెలుగు సంఘాలకు మాతృసంస్థలాంటి టి ఎల్ సి ఎకు అధ్యక్షునిగా వ్యవహరించే అవకాశం రావడం నా అదృష్టమని, అధ్యక్షునిగా కమ్యూనిటీకి మరింత సేవలందించేందుకు కృషి చేస్తానని, అలాగే టిఎల్‌సిఎ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకా కమ్యూనిటీ ఆదరణను పొందుతున్నదంటే అందుకు పూర్వ అధ్యక్షులు, వారి కార్యవర్గం చేసిన కృషి వల్లనే అని చెప్పారు.
టిఎల్‌సిఎ 2025 నూతన కార్యవర్గం
సుమంత్ రామ్ శెట్టి (ప్రెసిడెంట్)
మాధవి కోరుకొండ (వైస్ ప్రెసిడెంట్)
శ్రీనివాస్ సనిగెపల్లి (సెక్రటరీ)
అరుంధతి అదుప (ట్రెజరర్)
కిరణ్ రెడ్డి పర్వతాల (ఎక్స్ అఫిషియో పాస్ట్ ప్రెసిడెంట్)
భగవాన్ నడిరపల్లి (జాయింట్ సెక్రటరీ)
లావణ్య అట్లూరి (జాయింట్ ట్రెజరర్)
సునీల్ చల్లగుల్ల, దివ్య దొమ్మరాజు, ప్రవీణ్ కరణం, సుధ మన్నవ, సునీత పోలెపల్లి సభ్యులుగా ఉన్నారు.











