ట్రంప్ తో అక్రమ సంబంధముంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు అక్రమ సంబంధముందని సినీనటి స్టెఫానీ క్లిఫార్డ్ ఆరోపించింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలోనే ఈ విషయాన్ని వెల్లడించేందుకు తాను సిద్ధపడ్డానని తెలిపింది. అయితే, ట్రంప్‌తో ఉన్న లైంగిక సంబంధాన్ని ఎట్టిపరిస్థితుల్లో వెల్లడించకూడదని ట్రంప్ వ్యక్తిగత లాయర్ తనను బెదిరించాడని తెలిపింది. అంతేగాకుండా, ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉంటే తనకు ముడుపులు కూడా చెల్లిస్తానని చెప్పాడని పేర్కొన్నది. ఈ వివరాలను అమెరికన్ టాబ్లాయిడ్ ఇన్ టచ్ ఓ కథనం రూపంలో ప్రచురించింది. ట్రంప్‌తో శృంగారంలో పాల్గొన్నట్టు భావిస్తున్న సినీ శృంగారతార స్టెఫానీ క్లిఫార్డ్ ఇంటర్వ్యూను ప్రచురించింది. మెలానియా బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో శారీరక సంబంధం పెట్టుకున్నట్టు ఆమె ధ్రువీకరించింది. అప్పట్లో ట్రంప్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అప్రెంటిస్ షోలో తనకు పాత్ర ఇస్తానని ఆఫర్ కూడా చేశాడని ఆమె తెలిపింది.













