ట్రంప్ మాజీ సలహాదారు అరెస్టు
సరిహద్దు గోడ నిర్మాణం పేరుతో భారీగా విరాళాలు సేకరించి మోసగించిన అమెరికా అధ్యక్షుడ డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీఫెన్ బానన్ (66)ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన గత ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌నకు రాజకీయ సలహాదారుగా పనిచేశారు. అక్రమ వలసల నిరోధానికి మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మిస్తామని ట్రంప్ ప్రకటించగా, దాన్ని ఆసరాగా చేసుకొని బానన్ విరాళాలు సేకరించారు. వియ్ విల్ బిల్ట్ ద వాల్ పేరుతో వేలాది మంది నుంచి ఆన్లైన్ ద్వారా 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.180 కోట్లు) సేకరించారు. ఇందతా బోగస్ వ్యవహారమే కావడం గమనార్హం. ఆయనకు మరో ముగ్గురు సహకరించారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తనకు తెలియదని, ఆయనతో ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వ నిధులతో సరిహద్దులో ఇప్పటికే దాదాపు 300 మైళ్ల గోడను నిర్మించారు.













