ఫేస్బుక్ కు పిలుపు
కొందరు బీజేపీ నాయకుల విద్వేషపూరిత పోస్టులను ఫేస్బుక్ చూసీచూడనట్లు వదిలేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 2న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫేస్బుక్కు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఫేస్బుక్ ప్రతినిధులతో చర్చించనుంది. పౌరుల హక్కులను రోణ కల్పించడం, అంతర్జాలంలో మహిళల భద్రత అంశాలపై కూడా చర్చించే ఈ సమావేశానికి ఫేస్బుక్ ప్రతినిధులతో పాటు ఐటీ మంత్రిత్వశాఖ అధికారులను కూడా పిలిచింది. అలాగే ఇంటర్నెట్ నిలిపివేతలపై సెప్టెంబర్ ఒకటో తేదీన స్టాండింగ్ కమిటీ సమాచార ప్రసారశాఖ అధికారులు, హోంశాఖ అధికారులతో భేటీ కానుంది. బిహార్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. వచ్చేనెల ఒకటి, రెండో తేదీల్లో జరిగే ఐటీ స్టాండింగ్ కమిటీ సమావేశాల ఎజెండాను లోక్సభ సచివాలయం ఒక నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది.













