Srivari Kalyana Mahotsavam: జర్మనీలో ఘనంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం!
జర్మనీలోని మ్యూనిక్, కొలోన్ నగరాలలో తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం (Srivari Kalyana Mahotsavam) వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) సహకారంతో, తెలుగు అసోసియేషన్ జర్మనీ ఇ.వి. (TAG) ఈ మహోత్సవాన్ని నవంబర్ మొదటి వారాంతంలో నిర్వహించింది. టీటీడీ (TTD) డిప్యూటీ ఈ.ఈ. మల్లయ్య పర్యవేక్షణలో టీటీడీ వేద పండితుల బృందం శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణ క్రతువును నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, పుష్పాలంకరణలతో ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ (Srivari Kalyana Mahotsavam) ఘట్టాన్ని వీక్షించిన భక్తులు ‘గోవిందా… గోవిందా…’ నినాదాలతో పులకించిపోయారు.
ఈ వేడుకలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతోపాటు.. మ్యూనిక్, కొలోన్ పట్టణాల్లోని తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన భారతీయ భక్తులు పాల్గొన్నారు. భక్తులకు టీటీడీ (TTD) లడ్డు ప్రసాదం, కళ్యాణ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో టీఏజీ (TAG) అధ్యక్షులు నరేష్ కోనేరు, జనరల్ సెక్రటరీ సుమంత్ కొర్రపాటి, ట్రెజరర్ డా. శ్రీకాంత్ కుడితిపూడి కీలకపాత్ర పోషించారు. ఈ అవకాశం దక్కడం తమ అదృష్టమని పేర్కొన్నారు. ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) చైర్మన్ డాక్టర్ రవి వేమూరి, యూరప్ కోఆర్డినేటర్ డాక్టర్ కిషోర్ బాబు చలసాని, షెంగెన్ ఏరియా కోఆర్డినేటర్లు డాక్టర్ శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎంతో కృషిచేశారు.
మ్యూనిక్‌లో ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస కళ్యాణానికి శర్మ ఆర్యసోమయాజుల, పవన్ భాస్కరలు కూడిన శివాలయం బృందం, వెంకట్ కండ్ర, రామ్ బోళ్ళ, టిట్టు మద్దిపట్ల, శివ నక్కల, బాల అన్నమేటి, శ్రీనివాస్ దామ, విద్యాసాగర్ రెడ్డి, వికాస్ రామడుగు, రంజిత్, శ్రీనివాస రెడ్డి, కృష్ణ కాంత్, అశోక్ రెడ్డి, కళ్యాణ్ దుళ్ల, కిషోర్ నీలం, హరి, లీల మనోరంజన్, రవి పేరిచర్ల, బాబు రమేష్, శ్రీకాంత్, టీఏజీ (TAG) బవేరియా టీమ్‌తో కూడిన నిర్వాహక బృందం నిర్వహించింది.
కొలోన్‌లో ఈ వేడుకలు నిర్వహించడంలో టీఏజీ-ఎన్ఆర్డబ్ల్యూ (TAG-NRW) బృందం నుండి కిశోర్ నల్లపాటి, సందీప్ కొర్రపాటి, రవి తేజ కాజా, కృష్ణుడు, సతీష్, శివ బత్తుల, అలాగే ఎస్వీకే-ఎన్ఆర్డబ్ల్యూ (SVK-NRW) సభ్యులు రవి శంకర్, ఆనంద్, వంశీ, సతీష్ రెడ్డి, రామ్ కృషి చేశారు.







