NATS: నాట్స్‌లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
టాంపాలో జరుగుతున్న నాట్స్ (NATS) 8వ అమెరికా తెలుగు సంబరాల రెండోరోజు కార్యక్రమం తిరుమల శ్రీవేంకటేశ్వరుని కళ్యాణంతో ప్రారంభమైంది. నాట్స్ కాన్ఫరెన్స్ కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి, కార్యదర్శి మల్లాది శ్రీనివాస్, మిక్కిలినేని సుధీర్, నందమూరి రామకృష్ణ, పితాని సత్యనారాయణ, మన్నవ మోహనకృష్ణ, మురళీ మేడిచర్ల, ఆలపాటి రవి, సుధీర్ అట్లూరి, హరనాథ్ బుంగతావుల, గోపీచంద్ మలినేని, డా. మధు కొర్రపాటి, మంచికలపూడి శ్రీనివాసబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినీ నటుడు బాలకృష్ణ-వసుంధర దంపతులు కూడా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు.







