కమనీయ కళ్యాణం రమణీయ నృత్యం !
ఆటా, టాటా (ATA & TATA) సంయుక్తంగా టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ పట్టణంలో నిర్వహించిన తెలుగు మహాసభలు సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ, వ్యాపార వేదికగా నిలచింది. మహాసభల చివరి రోజున శ్రీనివాస కళ్యాణం భక్తి పరవశ్యాలకి ప్రతీకగా నిలవగా కళ్యాణం తరువాత జరిగిన భారతీయ సాంప్రదాయ సంగీత నృత్య కార్యక్రమాలు ప్రవాస తెలుగు వారిని విశేషంగా ఆకర్షించాయి. టేనస్సీ రాష్ట్రం మెంఫిస్ పట్టణంలో ఇండియన్ బాలే థియేటర్ అనే కూచిపూడి కళాక్షేత్రం నిర్వహిస్తున్న డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ వాసిలి ప్రదర్శించిన ఆనంద తాండవ మాడే శివుడు రసజ్ఞుల ప్రశంసలు చూరగొంది. శ్రీమతిచంద్ర ప్రభ చక్కనైన హావభావాలు ప్రదర్శించగా శ్రీ రమణ నాట్యకళకి ఆద్యుడైన శివుని ఆనంద తాండవాన్ని అద్భుతంగాప్రదర్శించారు.
శ్రీ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ జంటగా సెయింట్ లూయిస్ పట్టణంలో తానా 2017 లో నిర్వహించిన తెలుగు మహాసభల్లో అలాగే నాట్స్ చికాగో పట్టణంలో 2017 లో నిర్వహించిన తెలుగు సంబరాల్లో సాంప్రదాయ నృత్య ప్రదర్శన చేసి ప్రవాస తెలుగు వారిని అలరించారు. జూన్ 29 నుండి జులై 1 వరకు టెక్సాస్ రాష్ట్రం హూస్టన్ పట్టణంలో అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే 4వ తెలంగాణా ప్రపంచ మహాసభల్లో కూడా ఈ దంపతులు నాట్య ప్రదర్శన చేసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
Dr. Ramana Vasili
ramanavvasili@hotmail.com
901-387-9646
www.spiritualfoundation.us













