టీసీఏ అస్టిన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ బత్తుల
ఆస్టిన్: అమెరికాలోని ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. బహ్రెన్స్ రాంచ్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాస్ బత్తుల, ఎలక్టెడ్ ప్రెసిడెంట్‌గా అర్జున్ అనంతుల, కార్యదర్శిగా శ్రీనివాస్ బైరపనేని, కోశాధికారిగా వెంకట్ సాధినేని నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఐదుగురిని ఎన్నుకున్నారు.
పరమేశ్వర్‌రెడ్డి నంగి (స్పోర్ట్స్), శైలజ కోమటి (కల్చరల్, ఈవెంట్ మేనేజ్మెంట్), మధుకర్ గంగాడి (ఫైనాన్స్, స్పాన్సర్షిప్), భరత్ పిస్సాయ్ (మెంబర్షిప్, టెక్నాలజీ), చిన్నప్ప కుందూరు (లాజిస్టిక్స్, ఫుడ్) సంయుక్త కార్యదర్శులుగా నియమితులయ్యారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా వెంకట్రామిరెడ్డి ఉమ్మా, రామ్ హనుమంతరెడ్డి మల్లిరెడ్డి, మురళీధర్‌రెడ్డి వేలూరును ఎన్నుకున్నారు. గత కార్యవర్గంలో సేవలందించిన బ్రహ్మేంద్రరెడ్డి లక్కు, కిశోర్ పాము, వెంకట శివానందరెడ్డి నామాలకు టీసీఏ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.













