శ్రీ వెంకటేశ్వర లోటస్ టెంపుల్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి వేడుకలు

వర్జీనియాలోని శ్రీ వెంకటేశ్వర లోటస్ టెంపుల్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం నాడు మన చేతులతో మనమే వినాయక విగ్రహం తయారు చేసుకునే కార్యక్రమానికి నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. శని, ఆదివారాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు వినాయక విగ్రహం తయారీపై వ్యక్తిగత క్లాసులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు www.svlotustemple.org లింకును సందర్శించగలరు.ఇలా రిజిస్టర్ చేసుకున్న వారందరికీ గొడుగు సహా వినాయక మూర్తి కిట్స్‌ను అందజేయడం జరుగుతుంది.