TAGS ఆధ్వర్యంలో ప్రవాసులకు “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ”

కాలిఫోర్నియాలో నెలకొని ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్యంలో తలపెట్టిన “శ్రీ యు.ఏ.ఎన్ మూర్తి స్మారక 4వ రచనల పోటీ” సమాచారాన్ని “తెలుగు టైమ్స్” పాఠకులతో పంచుకోవలసినదిగా మా మనవి. విదేశాలలో ఉన్న తెలుగువారందరూ ఈ కథ, కవితల పోటీలో పాల్గొనడానికి అర్హులు అని తెలియజేయడమైనది. ప్రవాసులు తమ రచనలను మా ఈమెయలు telugusac@yahoo.com కు పంపాలి. రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: నవంబర్ 30, 2021.
ధన్యవాదాలు,
–వెంకట్ నాగం
శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం