కాల్గరీ లో ఘనంగా శ్రీ సత్య సాయిబాబా జన్మదిన వేడుకలు
శ్రీ సత్య సాయిబాబా కాల్గరీ కెనడా వారు శ్రీ సత్య సాయిబాబా 94 వ జన్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాల్గరీ శాఖ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ అనుపిండి ,సత్య సాయి గారి జన్మ విశిష్ఠతలు, వారి బోధనలు మరియు ప్రార్ధనల గురించి చక్కగా వివరించారు. డాక్టర్. జయశ్రీ తాతే భట్ గారు సాయి మహిమలు, భగవద్గీత శ్లోకాల వివరణలతో చక్కగా ప్రసంగించారు. సుందర్ కృష్ణమూర్తి మరియు వారి బృందంతో సాయి భజనలను ఆలపించారు. తన్మయీ, సాత్విక, మహాలక్హ్మి గార్లు వీనులవిందైన సంగీతం తో ప్రేక్షకులు మైమరిచారు.
శ్రీ సత్య సాయిబాబా గారు మనకు ప్రబోధించిన సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస తత్వాలు వాటి విశిష్టతలను సోదరుడు కియాన్ చక్కటి ప్రసంగాన్ని చదివారు. కాల్గరీ శ్రీ సత్య సాయి స్కూల్ చిన్నారులు ఒక చక్కటి నాటిక రూపంలో సాయి 8 ప్రభోధనలు- నియంత్రణ,మానవత్వం,సానుభూతి, కృతజ్ఞతా భావం, క్షమాగుణం, సామరస్యం, కారుణ్యగుణం, న్యాయ ఉదారత నాటిక రూపంలో ప్రదర్శించి ఆకట్టు కొన్నారు. సుమారు 350 పైగా ఫామిలీస్ పాల్గొని సాయి జన్మ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. దివ్య మల్లవరపు, అర్చన వైధీ, సంగీత, సోనియా లు మ్యూజిక్ అందరిని అలరించాయి. సాయి భజనలతో, షడ్రసోపేతమైన డిన్నర్ అందించబడింది. చాల మంది వాలంటీర్లు పాల్గొన్నారు.
శ్రీ శ్రీనివాస్ అనుపిండి, ప్రెసిడెంట్ గారు చిన్నారులకు వేదం మరియు సంస్కృత పాఠాలు ఉచితంగా ప్రతి శని వారము కాల్గరీ హిందూ మందిర్ లో నిర్వహిస్తున్నారు. వారి సేవానిరతిని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఎక్కడో వున్నా, మన భారత సాంస్కురుతిని పాటించడం మరింత పొగడతగ్గ విషయమే.













