కాల్గరీ కెనడా శ్రీ సత్య సాయి ఆరాధన మహోత్సవం
శ్రీ సత్య సాయిబాబా ఆరాధన మహోత్సవం కనుల పండుగగా ఏప్రిల్ ఇరవై ఏడున హిందూ మందిర్, కాల్గరీ, అల్బెర్టా, కెనడా లో ఘనంగా జరిగింది. కాల్గరీ శ్రీ సత్య సాయి సెంటర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అనుపిండి మరియు టీం సభ్యులు, సుందర్ కృష్ణమూర్తి, గోపాల నాయుడు, విజయ్ గార్లచే ఘనంగా నిర్వర్థించడం జరిగింది. చంద్రన్ అయ్యర్ గారి చమత్కార సంభాషణలతో, సాయి భజనలతో ఆరాధన మహోత్సవ వివరణ అందరిని ఆకట్టుకొంది. శ్రీమతి సోనియా బ్రాగంజా స్వాగతంతో వేదిక ప్రారంభం కాగా శ్రీమతి మహాలక్ష్మి బృంద సభ్యులతో వీనుల విందు సంగీత కార్యక్రమము జరిగింది. శ్రీ సత్య ఆశయాలు శాంతి, ప్రేమ, కారుణ్యాల గురించి విపుల సుందర్ మరియు కియాన్ విద్యార్థులు చక్కగా వివరించి ఆకట్టుకున్నారు. ఇరువై కి పైగా శ్రీ సత్య సాయి విద్యార్థులు సాయి ఆశయాల్ని వివరణలతో ప్రదర్శన చూపరులను ఆనంద పరచాయి. నూట యాభై కి పైగా కుటుంబాలు పాలొన్నాయి. అందరికి భోజనాలు, ప్రసాదాలు ఇవ్వబడ్డవి.













