సెప్టెంబర్ 16, 17 తేదీల్లో శ్రీ మహా సరస్వతీ జ్ఞాన యజ్ఞ మహోత్సవము
సకల విద్యాజ్ఞాన ప్రాప్యర్థం, జగదభ్యుదయార్ధం జ్ఞానదాత్రి శ్రీ మహాసరస్వతీ జ్ఞాన యజ్ఞ మహోత్సవమును సెప్టెంబర్ 16, 17 తేదీల్లో ఇల్లినాయిలోని 5999 న్యూవిల్కీరోడ్డులోని రోలింగ్ మిడోస్లో వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సరస్వతీ యజ్ఞాధ్యక్షులుగా ‘సరస్వతీపుత్ర’ శ్రీమాన్ వేదాల శ్రీనివాసాచార్య (ఒక్లహోమా), శ్రీ సరస్వతీ యజ్ఞ ప్రధానాచార్యులుగా ఆగమభట్టారక శ్రీమాన్ పరాంకుశం హనుమత్ ప్రసాద్ (చికాగో), యాజమాన్య దంపతులుగా డా. శొంఠి శారదాపూర్ణ, డా. శొంఠి శ్రీరామశర్మ వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.
16వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 4గం.లకు అనుజ్ఞ, దీక్షా స్వీకారం, అంకురార్పణం, హోమం, రా. 7:30 గం.లకు పూర్ణాహుతి ప్రసాద వినియోగం జరుగుతుంది.
సెప్టెంబర్ 17వతేదీ శనివారం ఉదయం 8 గం.లకు శ్రీ సరస్వతీ ఆరాధన, శ్రీ సరస్వతీ మూలమంత్రహోమం, మధ్యాహ్నం 12.30 గం.లకు మహాపూర్ణాహుతి, ప్రసాదవితరణ, సాయంత్రం 4గం.లకు శ్రీ సరస్వతీ వ్రతం, శ్రీ సరస్వతీ కుంకుమార్చన, మంగళహారతి, సాయంత్రం 6 గంటలకు అక్షరాభ్యాసం, శ్రీ సరస్వతీ మంత్రోపదేశం జరుగుతుంది. రాత్రి 7.30 గం.లకు ప్రసాద వినియోగం ఉంటుంది.
శ్రీ సరస్వతీ జ్ఞానయజ్ఞంలో పాల్గొనే భక్తులు 116 డాలర్లు, కుంకుమార్చనలో పాల్గొనే భక్తులు 51 డాలర్లు, అక్షరాభ్యాసం చేయించాలనుకున్నవారు 36 డాలర్లు చెల్లించి పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.













