జగన్మాత నృత్యహేల!
మెంఫిస్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ లలితా మహా యజ్ఞానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ దుగ్గిరాల సుబ్బరాయ ప్రసాద్ ఒక ప్రకటనలోతెలిపారు. అమెరికాలోవార్షిక యజ్ఞాలు చేసే ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందింది మెంఫిస్ ఐ సి సి టి శ్రీ వెంకటేశ్వర ఆలయం. గత పాతిక సంవత్సరాల్లో 20 పైగా యజ్ఞాలు రెండు కుంభాభిషేకాలు సమర్ధంగా నిర్వహించారు.వందకు పైగా హోమకుండాలు నిర్మించి శతాధిక ఋత్విక్కులతో యజ్ఞాలు నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. ఐసిసిటి డాన్స్ అకాడమీ డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభవాసిలి నిర్దేశికత్వంలో “జగన్మాత నృత్యహేల” ఈ శ్రీ లలితా మహాయజ్ఞం సందర్బంగా ప్రదర్శించనున్నట్లుడాక్టర్ ప్రసాద్ తెలిపారు. డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ 2014 నుండి శ్రీవెంకటేశ్వర ఆలయంలో పద్మవిభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం సాంప్రదాయ పద్దతిలో కూచిపూడి నృత్య శిక్షణనిస్తున్నారు. ఫిబ్రవరి 3 నుండి ప్రతి శని మరియు ఆదివారాల్లో ప్రత్యేక నృత్య శిక్షణాతరగతులు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో నిర్వహిస్తారు.
శ్రీ మహా లక్ష్మి, పార్వతి దేవి, సరస్వతి దేవిని కీర్తించి ప్రస్తుతించె శ్లోకాలు, సంకీర్తనలకు సంప్రదాయ కూచిపూడి పద్ధతిలో నృత్య రచన చేస్తున్నట్లు నాట్య గురువులు డాక్టర్ రమణ మరియు శ్రీమతిచంద్ర ప్రభ తెలిపారు. ఈ ప్రత్యేక నృత్య ప్రదర్శనలో పాల్గొనే వారికీ వయోపరిమితి లేనప్పటికీ ఆరు సంవత్సరాల కన్నా పిన్న వయస్సువారిని విశేషప్రతిభ కనబరిస్తే తప్ప అంగీకరించారు. శ్రీ లలితామహా యజ్ఞం ఆగష్టు 22-26 వరకు టేనస్సీ రాష్ట్రం ఈడ్స్ పట్టణం (మెంఫిస్ పట్టణ పొలిమేరలు) లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా, పండితాచార్యుల ముఖేన జరుగుతుంది. జగన్మాతనృత్యహేల ఆగష్టు 25 సాయంత్రం 6:30-08:00 గంటల వరకు ఆలయంలోని మల్టీ కల్చరల్ పెవిలియన్ లో జరుగుతుంది.
ఈ ప్రత్యేక నృత్య ప్రదర్శనలో పాల్గొనటానికి ఆసక్తి వున్నవారు మరిన్నివివరాలకి గురువులు డాక్టర్ రమణ వాసిలి గార్ని 901-387-9646 లేదా గురువు శ్రీమతి చంద్ర ప్రభ వాసిలి గార్ని 901-487-4139 సంప్రదించి గాని పొందవచ్చు. శ్రీ లలితా మహా యజ్ఞంలో పాల్గొనదలచిన వారు లేదా ఈ మహత్కార్యానికి ఆర్ధిక సహకారం అందచేయదలచిన వారు ఆలయ వెబ్ పేజీని ఆలయ వెబ్ పేజీ https://icctmemphis.org/ వివరాలకు చూడగలరు.
For all other details contact:
Guru Dr. Ramana Vasili, Director, ICCT Dance Academy (or)
Guru Smt. Chandra Prabha Vasili, Dance Choreographer, 901-487-4139
Visit Temple web page for more details: http://icctmemphis.org/ (or) http://spiritualfoundation.us/













