నాసా-అమెస్ లో శ్రీచైతన్య ప్రపంచ రికార్డు
నాసా అమెస్ స్సేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో శ్రీచైతన్య ప్రపంచ రికార్డు సాధించిందని విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సీమ వెల్లడించారు. లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించిన ఐఎస్‌డీసీ కాన్ఫరెన్స్‌లో మొత్తం 25 దేశాల నుంచి 480 మంది విద్యార్థులు పాల్గొనగా దేశం నుంచి 125 మంది పాల్గొన్నారని, అందులో 105 మంది శ్రీచైతన్య విద్యార్థులేనని వివరించారు. ఈ కాంటెస్ట్‌లో వరల్డ్ 1, 2, 3 ప్రైజులతో పాటు అత్యధిక విన్నింగ్ ప్రాజెక్టులు తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారన్నారు. విద్యార్థులను విద్యా సంస్థల అధినేత బీఎస్ రావు అభినందించారు.













