NATS: నాట్స్ ఆధ్యాత్మికం
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 8వ ద్వ్కెవార్షిక తెలుగు మహాసభల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా నిర్వాహకులు పెద్దపీట వేశారు. జూలై 5వ తేదీ ఉదయం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. వేదమంత్రోచ్ఛారణల శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నారు. జూలై 5వ తేదీ మధ్యాహ్నం అన్నమయ్య సంకీర్తన వర్క్ షాప్, కార్యక్రమం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు స్కాలర్ అమ్మ కొండవీటి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
జూలై 6వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకు భగవద్గీత కార్యక్రమం జరుగుతుంది. సంగీత వినోదంతో జ్ఞానోదయం అన్న థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ – గాయకుడు, ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్.వి. గంగాధర శాస్త్రి ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. భగవద్గీత వైభవం తెలియజేస్తారు.







