Jayanth Challa: అటు బిజినెస్ లో.. ఇటు సేవల్లో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా ప్రస్థానం
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన అమెరికా తెలుగు సంఘం (ATA)కు అధ్యక్షుడిగా ప్రస్తుతం సేవలందిస్తున్న జయంత్ చల్లా(Jayanth Challa) వర్జీనియాలో ఎన్నో సంవత్సరాలుగా స్థిరపడి కమ్యూనికి వివిధ రకాలుగా సేవలందిస్తున్నారు. అలాగే వివిధ పదవులను ఆయన చేపట్టారు. వివిధ సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు, వ్యాపారం చేసుకునేవారికి సహకారాన్ని అందిస్తూ వారికి మార్గదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఉన్నతికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆటా అధ్యక్షునిగా తెలుగు రాష్ట్రాల్లోని వారికి సేవలందించేందుకు విశేష కృషి చేస్తున్నారు. అటు వ్యాపారంలోనూ, ఇటు సేవల్లోను ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయంత్ చల్లా ప్రస్థానం గురించి తెలుగు టైమ్స్ పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తోంది.
తెలంగాణ నుంచి వర్జీనియా వరకు…
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ గ్రామానికి చెందిన జయంత్ చల్లా అమెరికాలోని వర్జినియాలో స్థిరపడ్డారు. జెఎన్‌టియులో ఇంజనీరింగ్ చదివిన తరువాత అమెరికాలో న్యూజెర్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేశారు. తరువాత అక్కడే ఉద్యోగం, వ్యాపారరంగంలో ప్రవేశం, కమ్యూనిటీతో మమేకమై అక్కడివారిలో తనదైన శైలిలో ముద్రవేసుకున్నారు. అమెరికా రాజకీయాలపై ఆసక్తితో పార్టీలకు మద్దతుగా ప్రచారం, భారతీయ అమెరికన్లు రాజకీయాల్లో ప్రవేశించేలా ప్రోత్సహించడం వంటివి ఆయనను ఉన్నతస్థానానికి తీసుకెళ్ళాయి. సాంకేతిక పరిజ్ఞానం, వ్యవస్థాపకత మరియు మార్గదర్శకత్వంతో అనేక వ్యాపారాలకు మరియు వ్యక్తులకు ఆయన చేతనైనంత సహాయం అందిస్తున్నారు. ఆయన చేసిన కృషి వల్ల ఎంతోమంది వ్యాపారంలో పైకి ఎదిగారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ కన్సల్టింగ్‌లో తన 30 సంవత్సరాల అనుభవంతో ఎంతోమందికి ఆయన ఉపాధి అవకాశాలు లభించేందుకు కృషి చేశారు. సాంకేతిక రంగంలో విశేష అనుభవం కలిగిన ఆయన అనేక కంపెనీల వ్యవస్థాపకతలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన వివిధ సంస్థలను స్థాపించడంతో పాటు, అనేక వ్యాపారాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఫెడరల్ ఏజెన్సీలకు సేవలందించేందుకు ఏర్పాటుచేసిన ఏస్ ఇన్ఫో సొల్యూషన్స్‌కు తొలుత కో ఫౌండర్‌గా కూడా వ్యవహరించారు. ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ తరువాత 1000 మంది ఉద్యోగులు పనిచేసే సంస్థగా ఎదగడం వెనుక ఆయన కృషి ఉంది. ఆయన వ్యాపారదక్షతకు నిదర్శనంగా కూడా చెప్పవచ్చు.
సాంకేతిక రంగాలలో ఉచిత శిక్షణ మరియు ఉపాధిని అందించే రూరల్ ఎంపవర్మెంట్.ఇంక్ అనే లాభాపేక్షలేని సంస్థను ఏర్పాటు చేయడంతోపాటు ఆ సంస్థకు సహభాగస్వామిగా కూడా ఉన్నారు.
అమెరికాలో రాజకీయ మరియు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, నిధుల సేకరణ ప్రాజెక్టులను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. అమెరికా రాజకీయాలలో భారతీయ సమాజం పాలుపంచుకునేలా చేస్తున్న కృషి కారణంగా ఆయన ఎంతోమంది రాజకీయ నాయకులకు మిత్రులయ్యారు.
ప్రస్తుతం 2025-2026 కాలానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా)కు అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నారు. అంతకుముందు 8 సంవత్సరాలు బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా, బిజినెస్ కమిటీ చైర్ మరియు సలహాదారుగా పనిచేశారు. తన కెరీర్‌ను మరియు ఖాళీ సమయాన్ని కమ్యూనిటీ సేవకు, ఇతరుల ఉన్నతికి అంకితం చేశారు. చల్లా ట్రస్ట్ ఫండ్ ద్వారా అమెరికా మరియు భారతదేశంలో అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ప్రస్తుత కార్యకలాపాలు:
2023- రూరల్ ఎంపవర్మెంట్ ఇంక్. సహ-వ్యవస్థాపకుడు, సిఇఓ. గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.
2021- వ్యాపార యజమానులు వ్యూహాత్మకంగా వృద్ధి చెందడానికి మరియు అభివృద్ధి చెందడానికి సహాయపడేందుకు శివార్ కన్సల్టెంట్స్ ఏర్పాటు
2023- స్కై సొల్యూషన్స్ మరియు సత్యసిల్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ సభ్యునిగా నియామకం.
2019-2021: ఏస్ ఇన్ఫో సొల్యూషన్స్ సహ-వ్యవస్థాపకునిగా, అధ్యక్షునిగా పనిచేశాను.
2000-2019: డోవెల్ టెక్నాలజీస్ కొనుగోలు చేసే వరకు ఏస్ ఇన్ఫోకు సహ-వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సిఇఓ గా పనిచేశాను. కెపిఎంజి, బేరింగ్ పాయింట్, టైకో ఇంటర్నేషనల్ కో. వంటి సంస్థలలో ఇంజనీరింగ్/మేనేజ్మెంట్లలో కీలకపాత్ర.
ఇండియాస్పోరా పోషకులు
సాంకేతిక ఆవిష్కరణలు, చిన్న వ్యాపారాలు మరియు ఉద్యోగ అభివృద్ధిపై అనేక జాతీయ వేదికలపై ప్రసంగాలు.
సామాజిక కార్యక్రమాలు:
రంగారెడ్డి జిల్లాలోని జిల్లేలగూడ హైస్కూల్ కు ఆర్థిక సహాయం. తండ్రి చల్లా లింగారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా పేరు మార్పు. ప్రతి సంవత్సరం 50 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు మరియు కంప్యూటర్ ల్యాబ్‌లు, లైబ్రరీ, ఫర్నిచర్ వంటి అనేక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, అభివృద్ధికి తోడ్పాటు.
శ్రీశైలం దేవస్థానంలో 5 బెడ్రూమ్ కాటేజ్ (2025), ఒక బెడ్రూమ్ చౌల్ట్రీ (2014) విరాళం.
2023లో రూరల్ ఎంపవర్మెంట్ యుఎస్ఎ ద్వారా అమెరికాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతిక రంగాలలో ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం చేపట్టారు.
ఆటా అధ్యక్షుడిగా, డిసెంబర్ 2023లో తెలుగు రాష్ట్రాలలో 20 వ్యాపార, ధార్మిక, విద్యా మరియు సాహిత్య కార్యక్రమాలు నిర్వహణ
ఇలా ఎన్నోకార్యక్రమాలతో అటు వ్యాపార ప్రముఖునిగా, ఇటు కమ్యూనిటీ నాయకునిగా జయంత్ చల్లా పేరుగాంచారు.
కెరీర్లో ముఖ్యాంశాలు…
వర్జీనియా చిన్న వ్యాపార కమిషన్ సభ్యునిగా నియామకం.
రూరల్ ఎంపవర్మెంట్ సహ-స్థాపన.
అమెరికా రాజకీయాలలో భారతీయ సమాజం భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం.
2025-2026 కాలానికి ఆటా అధ్యక్షుడిగా ఎన్నిక.
చల్లా ట్రస్ట్ ఫండ్ ద్వారా అమెరికా మరియు భారతదేశంలో ధార్మిక కార్యక్రమాలు.
అవార్డులు…
వర్జీనియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి రెండుసార్లు ‘‘వర్జీనియా ఫెంటాస్టిక్ 50 అవార్డ్’’ (2008, 2009).
స్మార్ట్ సిఇఓ మ్యాగజైన్ నుండి ‘‘లార్జ్ బిజినెస్ గవర్ స్టార్ అవార్డ్’’ (2014).
ప్రభుత్వ కాంట్రాక్టింగ్ రంగంలో ‘టై డిసి ఎలైట్ అవార్డ్’.
‘గ్రేటర్ వాషింగ్టన్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ అవార్డ్స్’లో ‘ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది ఇయర్’ ఫైనలిస్ట్
అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ నుండి ‘నేషనల్ డైరెక్టర్స్ అవార్డ్’ (2010).
‘మైనారిటీ ఎంటర్ప్రైజ్ అడ్వకేట్’ మ్యాగజైన్ కవర్ పేజీలో స్టోరీ ప్రచురణ (2009).
యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుండి ‘స్మాల్ బిజినెస్ కాంట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్’ (2008).
ఆటా కాన్ఫరెన్స్ లో ‘‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ బిజినెస్’’ (2014).
తానా కాన్ఫరెన్స్‌లో ‘‘ఎక్సలెన్స్ అవార్డ్’’ (2019).
నాటా కాన్ఫరెన్స్‌లో ‘‘బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్సలెన్స్ అవార్డ్’’ (2023).
ఆటా సేవలను విస్తృతపరుస్తా
అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షునిగా కమ్యూనిటీకి విస్తృతమైన సేవలంది స్తానని జయంత్ చల్లా చెప్పారు. అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆటా సేవలను విస్తృతం చేయడంతోపాటు ప్రభుత్వ స్కూళ్ళకు అవసరమైన వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆటాలో అందరినీ కలుపు కుని కార్యక్రమాలను చేస్తానని కూడా తెలియజ ేశారు. ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా తెలుగు రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలను చేస్తానని, ఇప్పుడు అధ్యక్ష హోదాలో మరిన్ని సేవలు అందించడంతోపాటు అమెరికాకు వచ్చే విద్యార్థు లకు అవసరమైన గైడ్ లైన్స్ అందించడానికి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.







