రామాయణ బోధనలపై అమెరికాలో ప్రత్యేక కార్యక్రమం
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత పరిపాలనా వ్యవహారాల్లో రామాయణ బోధనలను భాగం చేయడంపై దృష్టి సారించేందుకు అమెరికాలోని వాషింగ్టన్లో కేపిటల్ హిల్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సమకాలీన ప్రపంచ రాజకీయాల్లో సాంస్కృతిక వారసత్వం ప్రాధాన్యతను వక్తలు వివరించారు. రామాయణ ఎక్రాస్ ఏసియా అండ్ బియాండ్ అన్న అంశంపై హిందూ యాక్షన్ సంస్థ సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలువురు దౌత్యవేత్తలు, చట్టసభల సభ్యులు, అధికారులు హాజరయ్యారు. అమెరికాలోని భారత రాయబారి తరణ్జిత్ సంగ్ సంధూ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.







