NATS: నాట్స్ తెలుగు సంబరాల్లో ‘లిరిసిస్ట్’ చంద్రబోస్‌కు స్పెషల్ అవార్డు
టాంపా బేలో జరుగుతున్న నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో ఆస్కార్ అవార్డు గ్రహీత లిరిసిస్ట్ చంద్రబోస్ (Chandrabose) కు ఘనసత్కారం జరిగింది. ఆయన సినీప్రస్థానంలో రాసిన అనేకమైన మధుర గీతాలను గుర్తుచేస్తూ.. అందమైన వీడియోను ప్రదర్శించారు. అనంతరం నాట్స్ కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, ప్రశాంత్ పినమనేని, రాజ్ కంద్రూ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా చంద్రబోస్‌ను సత్కరించి, ప్రత్యేక అవార్డును అందించారు. ఈ సందర్భంగా ‘పుష్ప’ సినిమాలో తను రాసిన ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ పాటలోని కొన్ని పంక్తులను పాడి వినిపించారు. ఆయన్ను సత్కరించిన నాట్స్ సభ్యులు.. ప్రత్యేక అవార్డుతో ఆయన్ను సత్కరించారు.







