స్పందన వాలీబాల్ పోటీలు
ఫీనిక్స్లో దివ్యాంగుల సహాయార్థం స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 16 జట్లు పాల్గొన్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు రవి మద్దినేని, రాం ఆచంట తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను భారత్లోని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని స్పందన- మెఫి మానసిక వికలాంగుల గ హానికి నూతన భవనం నిర్మించేందుకు ఉపయోగిస్తామని వెల్లడించారు. టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను స్పందన యూత్ కో-ఆర్డినేటర్స్ మేఘన, అనన్య పర్యవేక్షించారు. టోర్నమెంట్లో పాల్గొన్న ఆటగాళ్లందరికీ సాయికిరణ్ రామిడి, సాయి మాచెర్ల ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సురేష్, గణేష్, గోపి, ఫణి, దినేష్ సహకరించారు.













