TANA: తానా 24వ మహాసభల సావనీర్ విడుదల
డెట్రాయిట్ వేదికగా ఘనంగా జరిగిన తానా (TANA) 24వ మహాసభల్లో తానా లీడర్‌షిప్ అంతా కలిసి సావనీర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది భాష, సాహిత్యం, ఇతర రంగాల్లో తానా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సమ్మిళితం చేసి ఒక సంపుటిని తయారు చేశారు. దీన్ని ముఖ్యఅతిథి రఘురామకృష్ణం రాజు గరికి సావనీర్ కమిటీ సభ్యులు అందజేశారు. తానా బోర్డ్ చైర్మన్ నాగేంద్ర కొడాలి, ఫౌండేషన్ చైర్ శశికాంత్ వల్లేపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నరేన్ కొడాలి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీనివాస్ లావు, సెక్రటరీ రాజా కసుకుర్తి, ట్రెజరర్ మరియు తానా ఈసీ సభ్యులు భరత్ మద్దినేని, కాన్ఫరెన్స్ కోర్ కమిటీ సభ్యులు, తానా మాజీ ప్రెసిడెంట్లు హనుమయ్య బండ్ల, తోటకూర ప్రసాద్, కోమటి జయరాం, అంజయ్యచౌదరి లావు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉదయకుమార్, చైర్మన్ గంగాధర్ నాదెండ్ల, ముఖ్యఅతిథి రఘురామకృష్ణం రాజు, మురళీ మోహన్, కామినేని శ్రీనివాస్, సావనీర్ కమటీ సభ్యులు తదితరులంతా కలిసి ఈ సావనీర్‌ను విడుదల చేశారు.







