అమెరికాలో మంచు హిమపాతం… కొట్టుకుపోతున్న కార్లు…తెలుగు ఎన్నారై దంపతుల మృతి
అమెరికాలో కురుస్తున్న దట్టమైన మంచు తుపాను ధాటికి అమెరికాలోని పలు ప్రాంతాలు ఇబ్బందులను పడుతున్నాయి. కొన్నిచోట్ల కార్లు నడవలేని పరిస్థితి కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల ఈ మంచు వల్ల ఎంతోమంది ఇబ్బందుల పాలయ్యారు. కొంతమంది మరణించారు. ఈ మంచు విధ్వంసానికి తెలుగు ఎన్నారై దంపతులు బలయ్యారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన మద్దన నారాయణ తన భార్య హరిత ఇద్దరు పిల్లలతో కలిసి న్యూజెర్సీలో నివాసం ఉంటున్నాడు.న్యూజెర్సీలో కురుస్తున్న బాంబు సైక్లోన్ మంచు తుఫాన్ దృశ్యాలను వీక్షించే క్రమంలోనే ఒక ఐస్ లేక్ లో ఫొటోలు తీసుకునేందుకు వెళ్లిన దంపతులు అనుకోకుండా ఆ మంచు ఫలకం కుప్పకూలడంతో అందులో పడిపోయారు. గడ్డకట్టిన ఒక భారీ ఐస్ క్యూబ్ పై నిలబడి ఫొటోలు తీసుకునే క్రమంలోనే ఐస్ గడ్డ ఒక్కసారిగి కుంగిపోయింది. దీంతో ముద్దన నారాయణ హరిత దంపతులు ఇద్దరూ ఐస్ గడ్డపై నుంచి కిందపడి ఐస్ లేక్ లో కింది భాగంలో చిక్కుకుపోయారు. ఐస్ లేక్ కావడం.. ఎడతెరపి లేని మంచు కురుస్తుండడంతో ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ బతికే ఛాన్స్ లేకుండాపోయింది. ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. ఈ రెస్క్యూలో హరిత మృతదేహం లభించగా.. నారాయణ మృతదేహం కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఇక దంపతులు ఇద్దరూ ఫొటోలు తీసుకునేందుకు వెళ్లే క్రమంలో పిల్లలు ఇద్దరినీ ఒడ్డున వదిలి వెళ్లారు. అదృష్టవశాత్తూ ఆ ఇద్దరూ ఒడ్డునే నిలబడి ఉండడంతో వారు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.













