చేపతో అమెరికా ఆందోళన
అమెరికాను ఓ చేప బెంబేలేత్తిస్తున్నది. జీవావరణ వ్యవస్థకు అది ముప్పుగా మారుతుందని ఆ దేశ వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఆందోళన చెందుతున్నారు. అవి కనిపిస్తే పట్టుకుని చంపేయాలని జాలర్లను కోరారు. తూర్పు ఆసియాకు చెందిన పాముతలను పోలిన చేప (నార్త్న్ స్నేక్ హెడ్ ఫిష్) ఇటీవల జార్జియాలో గ్విన్నెట్ కౌంటీలోని చెరువులో కనిపిచింది. అనుమతి లేకుండా వీటిని దిగుమతి చేసుకోవడం, రవాణా చేయడం, అమ్మడంపై అక్కడ నిషేధం ఉంది. కాగా కొందరు ఈ పాముతల చేపలను అక్రమంగా చెరువుల్లో విడిచిపెట్టి పెంచడంపై స్థానిక వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
మూడు అడుగుల వరకు పెరిగే ఈ చేప నేలపై కొంతదూరం కదులుతుందని పేర్కొన్నారు. ఈ చేప సమీప నీటి వనరుల్లోకి ప్రవేశించి అక్కడి జలచరాలను తినేస్తుందని, వీటి వృద్ది వల్ల క్రమంగా జీవావరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ చేపలను ఎలా గుర్తించాలన్నదానిపై స్థానిక జాలర్లకు శిక్షణ ఇచ్చారు. అనంతరం వాటిని చంపి ఫోటో తీసి తమకు పంపాలని జార్జియా సహజ వనరులు, వన్యప్రాణుల సంరక్షణ శాఖకు చెందిన మత్య్సకార విభాగం సూచించింది.













