స్మార్ట్ ఫోన్ తో విద్యార్థుల్లో ఏకాగ్రత లేమి!
స్మార్ట్ఫోన్ల వినియోగంతో యువతలో ఏకాగ్రత లేమి సమస్య పెరిగిపోయే ముప్పుందని తాజా అధ్యయనమొకటి హెచ్చరించింది. స్మార్ట్ఫోన్తోపాటు ఇతర డిజిటల్ పరికరల విడకం మితిమీరితే, ప్రధానంగా టీనేజీ పిల్లలు ఏకాగ్రత లేమి/ అతిక్రియాశీలత రుగ్మత (ఏడీహెచ్‌డీ) బారినపడే అవకాశాలు అధికమవుతున్నట్లు వెల్లడించింది. 15-16 ఏళ్ల వయసున్న 4,100 మంది విద్యార్థులపై అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లకు దూరంగా ఉండే విద్యార్థులతో పోలిస్తే, వాటిని విరివిగా ఉపయోగించే విద్యార్థుల్లో ఏడీహెచ్‌డీ లక్షణాలు దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంటున్నట్లు గుర్తించారు.













