ఇన్ఫెక్షన్లను పసిగట్టే స్మార్ట్ ఫోన్ రీడర్
వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను పసిగట్టే అతి చిన్న స్మార్ట్‌ఫోన్ రీడర్‌ను పరిశోధకులు తయారు చేశారు. దీని ద్వారా గవదబిళ్లలు, తట్టు, హెర్బ్స్ వంటి 12 రకాల వ్యాధులను గుర్తించవచ్చని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో వ్యాధులను సులువుగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ స్మార్ట్‌ఫోన్ రీడర్‌ను తయారు చేశారు. దీనితో 771 మంది రోగుల శాంపిల్స్‌ను పరీక్షించగా 99 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చాయన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ రీడర్ ఒకేసారి 96 శాంపిళ్లను విశ్లేషించి, కంప్యూటర్ ప్రోగ్రామ్ సహాయంతో వ్యాధులను గుర్తిస్తుందని అన్నారు.













