కృష్ణ యువకుడి జాక్‌పాట్
నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన పూర్వ విద్యార్థి కుంటముక్కల శివరామకృష్ణ ఉద్యోగ వేటలో జాక్‌పాట్ కొట్టాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గూగుల్ సంస్థలో లక్ష డాలర్ల వార్షిక వేతనం (మన కరెన్సీలో రూ.68.84 లక్షలు)తో ఉద్యోగం సంపాదించినట్లు ట్రిపుల్ డైరెక్టర్ డి.సూర్యచంద్రరావు తెలిపారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శివరామకృష్ణ 2008లో నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రథమబ్యాచ్లో సమీకృత ఇంజనీరింగ్ విధానంలో ప్రవేశం పొందాడు. అనంతరం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో 9.27 గ్రేడ్‌తో బీటెక్ పూర్తి చేసుకుని కార్నెగిమెల్లన్ విశ్వవిద్యాలయం సిల్కాన్ వ్యాలీ నుంచి సాప్ట్వేర్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ పూర్తి చేశాడు.













