Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Community » Usa Nri News » Siliconandhra sampada exam results

భారతీయ సంగీతం నృత్యాల కోసం అమెరికాలో ‘సిలికానాంధ్ర సంపద’

  • Published By: cvramsushanth
  • May 20, 2021 / 07:32 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Siliconandhra Sampada Exam Results

ప్రవాసంలో నివసిస్తూ, కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, శాస్త్రీయ నృత్య కళలయిన కూచిపూడి, భరతనాట్యం మరియు ఆంధ్ర నాట్యంలో శిక్షణ పొందుతన్న విద్యార్ధులకు, తెలుగు విశ్వ విద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక ద్వారా పరిక్షలు నిర్వహించి, అకడమిక్ క్రెడిట్స్ తో కూడిన జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికెట్స్ అందించే సంస్థ SAMPADA (Silicon Andhra Music Performing Arts and Dance Academy). ఎన్నో ప్రతికూల పరిస్టితుల మధ్య, గత మార్చి-ఏప్రిల్ నెలలో శ్రీ  పొట్టి  శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధికారుల పర్యవేక్షణలో ద్వారా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అంతర్జాలం ద్వారా, పైన పేర్కొన్న కోర్సుల్లొ శిక్షణ పొందుతూ, సంపద లో నమోదు చేసుకున్న దాదాపు 1800 మంది కి పైగా విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించి, మే నెలలో ఫలితాలను ప్రకటించడం జరిగింది. దాదాపు 98% ఉత్తీర్ణులయిన విద్యార్ధులకు జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికేట్ లలో ధృవీకరణ పత్రాలు అందించడం జరిగింది. విద్యార్ధులు ఎవరూ తమ ఇళ్ళ  నుండి బయటకు రాకుండా సునాయాసంగా మరియు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, విశ్వ విద్యాలయ అధికారులు, విద్యార్ధులు, తల్లి దండ్రులు, విద్యార్ధులకు శిక్షణ ఇచ్చిన గురువుల ప్రశంసలను అందుకున్నదని, ఈ పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సంపద కీలక బృంద సభ్యులయిన ఫణిమాధవ్ కస్తూరి, శాంతి కొండా, ఉష మాడభూషి , తెలుగు విశ్వ విద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి శ్రీమతి డా. రెడ్డి శ్యామల నాయకత్వంలోని అధికారుల బృంద సభ్యులైన డా. హనుమంతరావ్ కోట్ల, డా. పద్మప్రియ, డా. మురళీకృష్ణ, డా. శ్రీనివాసాచారి, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణలో సహకరించిన Dr. వనజ ఉదయ్, Dr. విజయపాల్, Dr. రాధ సారంగపాణి గార్ల కృషి ఎంతో ఉన్నదని సంపద డీన్ మరియు అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరు కాదలచిన విద్యార్ధులు SAMPADA.SILICONANDHRA.ORG వెబ్ సైట్ ద్వారా తక్షణం నమోదు చేసుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలిపారు. 

Telugu Times Custom Ads

ప్రపంచమంతటా కరోనా వ్యాధి విస్తరిస్తూ ఎన్నో ప్రాణాలను బలితీసుకుంటున్న ప్రతికూల సమయంలో, సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడెమి (సంపద)  అమెరికా లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల పిల్లలు మరియు పెద్దల మనసుకు స్వాంతన చేకూర్చే ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అమెరికా లో నివసిస్తున్న చిన్నారులకు, కర్ణాటక శాస్త్రీయ సంగీతం మీద అభిరుచిని పెంచటానికి, అన్నమయ్య, రామదాసు మరియు పురందర దాసు లాంటి  వాగ్గేయ కారుల గొప్పతనాన్ని రాబోయే  తరం చిన్నారులకు పరిచయం చేయటానికి అంతర్జాలం ద్వారా ఒక వేదిక ను కల్పించి, వారు రచించిన కీర్తనల మీద  పోటీల నిర్వహణకు సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడెమి చేపట్టింది. ఈ పోటీల గురించి ప్రకటించిందే తడవుగా అమెరికా వ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తితో నమోదు చేసుకొన్నారని , తొలి విడతగా జూన్ లో  ఐదు నగరాలలో నిర్వహించబోయే ప్రాంతీయ పోటీలలో గెలుపొందిన విజేతలు జూన్ నెలాఖరులో జరిగే జాతీయ పోటీలలో పాల్గొంటారని సిలికానాంధ వాగ్గేయకార ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ తెలిపారు. ఈ పోటీలకు అత్యంత కీలకమయిన సాంకేతిక నిర్వహణ నాయకత్వ భాద్యతను సిలికానాంధ్ర  ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి  నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకు vaggeyakara.siliconandhra.org  వెబ్ సైట్ ని సందర్శించ వచ్చని, ఈ రెండు కార్య క్రమాలు పేస్ బుక్, యు ట్యూబ్ లాంటి సామాజిక మాధ్యామాల ద్వారా ప్రత్యక్షం గా వీక్షించ వచ్చని, సంపద అధ్యక్షులు దీనబాబు ఒక ప్రకటనలో తెలిపారు.     

సంపద నిర్వహిస్తున్న వాగ్గేయయకార వైభవం కార్యక్రమం విజయవంతం కావడానికి, వర్జీనియా నుంచి, సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు  మాధురి దాసరి, రత్నవల్లి తంగిరాల, మాచిరాజు సుభ్రమణ్యం, న్యూ జెర్సీ నుంచి విజయ తురిమెల్ల, బాలు పసుమర్తి, లక్ష్మి నండూరి, రవి కామరసు, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు శరత్ వేట, చికాగో నుంచి మాలతీ దామరాజు, శాంతి చతుర్వేదుల, సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని,  ఒహాయో నుండి సుధ అవసరాల, దుర్గ మంతా, కాలిఫోర్నియా నుంచి మమత కూచిభొట్ల, సృజన నాదెళ్ళ, సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ తదితరులు సహకారం అందిస్తున్నారని సంపద అధ్యక్షులు దీనబాబు తెలిపారు.  

 

Tags
  • dance
  • Exam
  • results
  • SiliconAndhra Sampada
  • us

Related News

  • Telugu Actress Rojaramani Birthday Celebrations In New York

    NY: న్యూయార్క్ లో రోజారమణికి జీవనసాఫల్య పురస్కారం

  • Tama Dussehra Bathukamma Womens Celebrations

    TAMA: టామా దసరా-బతుకమ్మ, మహిళా సంబరాలకు ముహూర్తం ఫిక్స్

  • Tana Paatasala Classes Starts In America

    TANA Paatasala: అమెరికా వ్యాప్తంగా తానా – పాఠశాల తరగతులు ఆరంభం..

  • Free Flu Shots Under The Auspices Of Tama

    TAMA: టామా ఆధ్వర్యంలో ఉచితంగా ఫ్లూ షాట్స్

  • Tana Paatasala Classes Starts In Austin

    TANA Paatasala: అస్టిన్‌లో ప్రారంభమైన తానా పాఠశాల తరగతులు

  • Tana Mid Atlantic Womens Throwball Tournament A Success

    TANA: తానా మిడ్ అట్లాంటిక్ మహిళల త్రోబాల్ టోర్నమెంట్ విజయవంతం

Latest News
  • Mufthi Police: యాక్షన్ కింగ్ అర్జున్-ఐశ్వర్య రాజేష్ “మఫ్తీ పోలీస్” టీజర్
  • Sharwanand: శర్వా UV క్రియేషన్స్, #Sharwa36 హైదరాబాద్‌లో కీలక రేసింగ్
  • Kanthara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్ సెప్టెంబర్ 22న రిలీజ్
  • K-Ramp: కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ టీజర్
  • NY: న్యూయార్క్ లో రోజారమణికి జీవనసాఫల్య పురస్కారం
  • Ajitesh Korupolu: నగరంలో నగరంగా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌…
  • KCR: కవితకు కేసీఆర్ ఆహ్వానం..?
  • Kondapalli Srinivas: జనసేన ఎమ్మెల్యేకి హామీ ఇచ్చిన టీడీపీ మంత్రి
  • Prakasham: సడెన్ గా స్టేషన్ కు ఎస్పీ, ఉలిక్కిపడ్డ పోలీసులు
  • Chandrababu: పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చాం
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer