ఎన్నారైలకు కేసీఆర్ ఉగాది కానుక : శ్యాంబాబు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఎన్నారైశాఖకు రూ.వంద కోట్లు కేటాయించడం పట్ల టీఆర్ఎస్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు శ్యాంబాబు ఆకుల హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ఎన్నారైలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఉగాది కానుక అని అభివర్ణించారు. డెన్మార్క్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎంపీ కవిత, ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బింగాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులను గల్ప్ ఎన్నారైల సంక్షేమం కోసం వినియోగించాలని కోరారు. డెన్కార్క్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఆస్ట్రియా, పోలాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ నెదర్లాండ్స్, ఐర్లాండ్ దేశాల్లోని విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ ప్రసాదరావు కల్వకుంట్ల, ఉపాధ్యక్షుడు సతీశ్ గామినేని, జయచందర్ గంటల, చంద్రశేఖర్ వెన్నుపురెడ్డి, సురేశ్ కట్ట, శివ, చందు పల్లె, సంతోష్ గంజి పాల్గొన్నారు.













