అమెరికాలో మరోసారి కలకలం
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్‌విల్లెలో ఉన్న డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. వారంతా ఆఫ్రో అమెరికన్లే. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా దుండగుడు స్టోర్‌లోకి చొరబడ్డాడు. కాల్పుల సమయంలో అతడికీ తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. ఏఆర్`15 స్టైల్ రైఫిల్‌తో పాటు మరో హ్యాండ్‌గన్‌తో స్టోర్ వద్దకు వచ్చిన దుండగుడు పార్కింగ్ ప్రాంతంలో కనిపించిన ఆఫ్రో అమెరికన్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. జాత్యహంకారంతోనే దుండగుడు వారిపై కాల్పులు జరిపినట్లు జాక్సన్‌విల్లె పోలీసులు తెలిపారు.













