Dhanurmasam: ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించిన శివ విష్ణు దేవాలయ బృందం
పవాయ్ (శాన్ డియాగో): శాన్ డియాగోలోని శివ విష్ణు దేవాలయం, ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రకటించింది. వేద సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ దేవాలయంలో డిసెంబర్ 15వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస పూజలు ఘనంగా జరగనున్నాయి.
ముఖ్య కార్యక్రమం
ధనుర్మాసం అంతటా ప్రతి రోజు ఉదయం 7:30 గంటలకు తిరుప్పావై, తిరువెంపావై పారాయణం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావచ్చు. భక్తులు పూజ కోసం పుష్పాలు, పండ్లు, నైవేద్యాన్ని (వెల్లుల్లి, ఉల్లిపాయలు లేకుండా) తీసుకురావచ్చు. మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన నంబర్లు.. (858) 668 9730 లేదా (858) 504 4123.






