శాన్ ఫ్రాన్సిస్కోలో మళ్లీ కలకలం
అమెరికాలోని శాన్ఫ్రాన్సిక్కోలో మళ్లీ ఖలిస్థానీ కలకలం రేగింది. ఎన్ఐఏ అమెరికా పర్యటనను వ్యతిరేకిస్తూ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నేతృత్వంలోని నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అక్కడ ఆందోళన చేపట్టింది. షహీద్ సత్వంత్ సింగ్, షహీద్ బియాంత్ సింగ్‌లను ఇందిరా గాంధీ హత్య చేసినట్లు చిత్రీకరించిన ఫొటోలు పట్టుకుని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయాన్ని ద్బింధించింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ద్వారా హింసను ప్రారంభించిన ప్రధాని మోదీ 1984 అక్టోబరు 31వ తేదీని మర్చిపోకూడదని, భారత ప్రభుత్వం చేసిన హింసకు సిక్కులు ఎల్లప్పుడూ ప్రతిస్పందిస్తారని తెలిపింది. అయితే కొద్ది మంది అనుచరులతో పన్నూన్ లబ్దిపొందేందుకు, చట్టాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. విదేశీ ఏజెన్సీల తరపున పన్నూన్ పనిచేస్తున్నాడని చెప్పాయి. ఏది ఏమైనప్పటికీ భారత్ కాన్సులేట్‌ను ముట్టడిచడం తీవ్రమైన వ్యవహారమని, దీనిపై తమ సహచరులతో చర్చిస్తామని పేర్కొన్నాయి.













