హ్యూస్టన్ నుండి కేరళకు 10 వేల డాలర్ల సాయం
అమెరికాలోని భారతీయులకు చెందిన సేవా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ 10,000 డాలర్లను కేరళలో వరద బాధితుల సహాయార్థం సేకరించి పంపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సరిగ్గా ఏడాది క్రితం హరికేన్ హార్వే హౌస్టన్ను ఆతలాకుతలం చేసింది. ఆ విషాద జ్ఞాపకాల నుండి హౌస్టన్ ఇప్పుడు కోలుకుంది. కేరళలో వరద బాధితుల సహాయార్థం తక్షణమే నిధులను సేకరించింది. తన భారత భాగస్వామి దేశీయ సేవా భారతి కేరళమ్తో కలిసి ఈ నిధులు మొత్తాన్ని సేకరించినట్లు ఆ ప్రకనటలో పేర్కొంది. దాదాపు 5 వేల మంది సేవల వలంటీర్లు ఆహార పాకెట్లను వరద బాధితులకు పంపిణీ చేశారు. వంట సామాగ్రిని అందించారు. ఉచిత వంట శాలలను, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. హ్యూస్టన్లో నివసిస్తున్న కేరళ వాసులు ఓనం పండుగ ఉత్సవాలను రద్దు చేసుకున్నారు. హ్యూస్టన్లో దాదాపు 62 వేల మంది కేరళీయులు నివసిస్తున్నారు.













