అమెరికన్లకు సేవా ఇంటర్నేషనల్ బాసట
కొవిడ్-19 కారణంగా ఇబ్బందుల్లో ఉన్న అమెరికన్లకు సాయం అందించేందుకు భారత-అమెరికన్ స్వచ్ఛంద సంస్థ సేవా ఇంటర్నేషనల్, సౌత్ ఏసియన్ విమెన్ ఫిజీషియన్స్ ఆఫ్ నార్త్ అమెరికా ముందుకొచ్చాయి. కరోనా వైరస్ వల్ల సమస్యల్లో కూరుకున్న వారికి వ్యక్తిగతంగా, ఆర్థికంగా సాయం అందజేస్తామని ఆ సంస్థలు ప్రకటించాయి. సేవా ఇంటర్నేషనల్ ఇప్పటికే రూ.3.83 కోట్లు విరాళాలు సేకరించింది. ఆ సంస్థకు చెందిన వెయ్యి మంది కార్యకర్తలు 8 హెల్ప్లైన్లను ఏర్పాటు చేశారు. వీసాల సమాచారం ఇవ్వడంతో పాటు మాస్క్లు, ఆహారం, మందుల పంపిణీ వంటి విభిన్న సేవలను ఆ సంస్థ అందించింది.













