మైక్రోసాఫ్ట్ క్యాంపస్లో ఘనంగా సాయి పరివార్ ఏడో వార్షికోత్సవాలు
అగ్రరాజ్యం అమెరికాలో బెలీవూలో భారత సంప్రదాయ, ఆధ్యాత్మిక వేడుక జరిగింది. సాయి పరివార్ ఫౌండేషన్ ఏడో వార్షికోత్సవానికి ప్రఖ్యాత గురూజీ డాక్టర్ చంద్ర భాను సత్పతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెడ్మాండ్లోని మైక్రోసాఫ్ట్ క్యాంపస్లో ఈ కార్యక్రమం జరిగింది. గురూజీ రచించిన ‘శ్రీ గురు భగవత్’ ఎంతోమందికి ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతోంది. భారత గురువుల గొప్పతనాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక బోధనల ద్వారా సాయి పరివార్ ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన గురూజీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మందిపై ప్రభావం చూపించారు. ఈ వేడుకలో స్వయంగా జ్యోతి ప్రజ్వలన చేసిన గురూజీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన్ను వాషింగ్టన్కు ఆమ్వానిస్తూ నగర సెనేటర్ జెడిత్ వార్నిక్ ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక కూడా పంపారు. ఈ కార్యక్రమంలో వాషింగ్టన్ స్టేట్ రిప్రజంటేటివ్ డాక్టర్ వందన స్లాటర్, బ్యెరియన్ సిటీ కౌన్సిల్ మెంబర్ జిమ్మీ మాటా, మిస్ వరల్డ్ అమెరికా 2020 సైనీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఫౌండేషన్ చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు.













