యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనా
అమెరికా టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఐదో సీడ్ స్వితోలినాపై సెరెనా 6-3, 6-1 తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టికరిపించి తుది సమరానికి దూసుకెళ్లింది. సెరెనా తలపడిన ఆఖరి ఆరు టోర్నమెంట్స్‌లో నాలుగో సారి ఫైనల్‌కు చేరడం విశేషం. ఇటీవల జరిగిన వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరిన సెరెనా 2-6, 2-6 తేడాతో టైటిల్‌ను చేజార్చుకుంది. మరో సెమీస్‌లో బెన్సిచ్, ఆండ్రిస్కూ తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో విజేతతో సెరెనా ఫైనల్లో తలపడనుంది.













