ఐక్యరాజ్యసమితి పదవికి భారతీయుడి రాజీనామా?
ఐక్యరాజ్యసమితిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారతీయ ఉన్నతాధికారి సుధీర్ రాజ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన్ను స్వయంగా ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ఉమ్మడి పెన్షన్ నిధి ఆస్తుల పెట్టుబడి విభాగం ప్రతినిధిగా నియమించినట్లు తెలుస్తోంది. 2007లో ఈ బాధ్యతలు స్వీకరించిన సుధీర్, అప్పటి నుంచి చక్కగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని గుటెరస్ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు. అయితే సుధీర్ రాజీనామాకు గల కారణాలను ఆయన వెల్లడించలేదు.













