NATS: సంబరాల్లో ఆర్థిక విషయాలపై సెమినార్
నాట్స్ (NATS) 8వ ద్వైవార్షిక తెలుగు మహాసభల్లో భాగంగా లీగల్ ఫోరం ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అన్ లాకింగ్ వెల్త్, ట్యాక్స్ ప్లానింగ్, గ్రోత్ సీక్రెట్ అంశంపై సెమినార్ ను ఏర్పాటు చేశారు. ఎజి ఫిన్ ట్యాక్స్ ఫౌండర్, సిఇఓ అనిల్ గ్రంధి ఈ కార్యక్రమంలో మాట్లాడనున్నారు. మీరు ప్రొఫెషనల్ అయినా, వ్యవస్థాపకుడ్కెనా లేదా పెట్టుబడిదారుడ్కెనా, స్మార్ట్ టాక్స్ ప్లానింగ్ మరియు ఫెడరల్ ప్రోత్సాహకాలు మీ ఆర్థిక స్వేచ్ఛను ఎలా వేగవంతం చేయగలవో వంటివి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవచ్చని నిర్వాహకులు చెప్పారు. ఇందులో మిలియనీర్ టాక్స్-స్మార్ట్ వెల్త్ బిల్డింగ్ స్ట్రాటజీలను అన్‌లాక్ చేయడం, స్టార్టప్ లకు ఉచిత డబ్బు: స్టార్టప్‌లకు పన్ను క్రెడిట్‌లు, ప్రోత్సాహకాలు వంటి విషయాలపై కూడా ఆయన మాట్లాడుతారని అందువల్ల చిన్న వ్యాపార యజమానులు, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు, టెక్ నిపుణులు మరియు స్టార్టప్ వ్యవస్థాపకులు తప్పనిసరిగా హాజరై ఇలాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలని నిర్వాహకులు కోరారు.







