పక్కవారి పొగ తో హార్ట్ బీట్ కు దెబ్బ!
సిగరెట్లు తానే వారికే కాదు ఆ పొగ పీల్చేవారి ఆరోగ్యానికీ ప్రమాదం అన్న సంగతి తెలిసిందే. ప్యాసివ్ స్మోకింగ్‌తో గుండె లయ తప్పుతుందని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఈ విషయాన్ని గుర్తించారు. పొగాకు పొగ వలన గుండె కణజాలంలోని మార్పులను గుర్తించేందుకు ఈ అధ్యయనం చేశారు. ఇండోర్‌లో ఉంచిన ఎలుకలకు రోజుకు ఆరు గంటల చొప్పున 8 నుంచి 12 వారాలపాటు పొగాకు పొగ అందేలా చూశారు. అనంతరం వాటి గుండె పనితీరుని పరిశీలించగా హృదయ స్పందన అస్తవ్యస్తంగా మారినట్లు గుర్తించారు.













