జెట్లాగ్ నుంచి బయటపడేసే పరికరం!
తరచూ విమాన ప్రయాణాలు చేసేవారు జెట్లాగ్ నుంచి త్వరగా కోలుకోవడానికి, విభిన్న వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటానికి అమెరికా శాస్త్రవేత్తలు ఓ సాంకేతిక పరికరాన్ని రూపొందించారు. బయోమెట్రిక్ సమాచారం ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీనిని కళ్లకు మాస్కులగా ధరించవచ్చు. జీవక్రియలో మార్పు జెట్లాగ్కు కారణమవుతుంది. హార్మోన్ల విడుదల, జీర్ణక్రియపై ప్రభావం ఉంటుంది. ఈ పరికరం జీవక్రియలో మార్పు, నిద్రపై సూచనలు చేస్తుంది. ప్రయాణాల్లో ఏ సమయంలో ఎంత సేపు నిద్రపోవాలి, ఎప్పుడు మెలుకువతో ఉండాలి అన్నదానిపై సూచనలు చేసి జెట్లాగ్ నుంచి బయటపడేస్తుంది.













