సూపర్ కండక్టర్ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
అత్యధిక ఉష్ణోగ్రత వద్ద విద్యుత్‌ను ప్రవహింపజేసే సూపర్ కండక్టర్‌ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మునుపెన్నడూ లేని విధంగా మైనస్ 23 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత వద్ద విద్యుత్‌ను సూపర్ కండక్టర్ ద్వారా ప్రవహింపజేసినట్లు చికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. దీని ద్వారా ప్రవహించిన విద్యుత్ రెండు భిన్న అయస్కాంత క్షేత్రాల మధ్య నిరోధాన్ని కూడా ఎదుర్కోలేదని తెలిపారు. ఈ పరిజ్ఞానం సూపర్ కంప్యూటర్లు మరింత వేగంగా పనిచేయడానికి, అయస్కాంత సూత్రంపై ఆధారపడి నడిచే మాగ్నెటిక్ లెవిటేషన్ రైళ్ల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి దోహదపడుతుందన్నారు.













