ఆగస్టు 9 నుంచి అర్జెంటీనాలో స్కూళ్లు ప్రారంభం
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆర్జెంటీనాలో గత నాలుగు మాసాలుగా మూతబడిన స్కూళ్లను ఆగస్టు 9 నుంచి తిరిగి తెరవనున్నారు. దేశంలోని మొత్తం 24 రాష్ట్రాల్లోను ముఖాముఖి తరగతులు తిరిగి ప్రారంభించనున్నట్లు అర్జెంటీనా విద్యాశాఖ మంత్రి నికోలస్ తరోత్తా వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూనే ముఖాముఖి తరగతులు నిర్వహించేందుకు అవసరమైన సన్నాహాలు చేపడుతున్నామన్నారు. కరోనా తాకిడి తగ్గని ప్రాంతాల్లో అంచెలంచెలుగా స్కూళ్లు తెరుస్తామన్నారు. కొత్త ఆరోగ్యభద్రతా ప్రోటోకాల్‌కు అనుగుణంగా తరగతి గదులను పునర్నవీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతులు వంటివి చేపట్టేందుకు ప్రభుత్వం 230 కోట్ల డాలర్ల పెసోలు (3.2 కోట్ల డాలర్లు) వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు.













