తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్‌ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్ అట్లాంటిక్ బృందం ఫిలడెల్ఫియాలో కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన బ్యాక్ ప్యాక్ కార్యక్రమంలో స్థానిక జాన్ బార్టమ్ హై స్కూల్లో విద్యార్థులకు 150 స్కూల్బ్యాగ్లను, ఇతర వస్తువులను అందజేసింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ బ్రియాన్ జాన్సన్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ జెరెమీ కూపర్ తానా చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ గొప్ప విరాళాల కార్యక్రమానికి తమ పాఠశాలను ఎంచుకున్నందుకు మిడ్ అట్లాంటిక్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తానా నాయకులు రవి పొట్లూరి, సతీష్ తుమ్మలతో కలిసి మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ సమన్వయకర్త సునీల్ కోగంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైనందుకు జగదీష్ అనుముల, కిరణ్ క్రోతపల్లి, గోపి వాగ్వలకు సునీల్ ధన్యవాదాలు తెలిపారు. మునుముందు కూడా తానా నాయకత్వం, అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు సహకారంతో ఇలాంటి కమ్యూనిటీ ఈవెంట్స్ మరిన్ని నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తానా మిడ్ అట్లాంటిక్ బృందం వెల్లడిరచింది. ఇక ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన రాజా కసుకుర్తి (కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్), పరమేష్ దేవినేని (బ్యాక్‌ప్యాక్ చైర్), తానా ఫిలడెల్ఫియా బృందానికి సునీల్ కోగంటి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే స్కూల్ మేనేజ్మెంట్తో బ్యాక్‌ప్యాక్ ప్రోగ్రామ్‌ను సమన్వయం చేసినందుకు రజిత మాలేకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.













