ఎన్నారైల కోసం ఎస్ బిఐ జిఎన్ సి
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న ఎన్నారై కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా, సులభంగా సేవలు అందించేందుకు ‘గ్లోబల్ ఎన్నారై సెంటర్(జీఎన్సీ)ను గోవాలోని కొచ్చి నగరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ప్రారంభించింది. జీఎస్సీ ద్వారా 16 సర్కిల్స్, 66 ప్రాంతాలలోని 92 ఎన్నారై బ్రాంచ్లకు కేంద్రీకతమైన సేవలను అందించనుంది. ప్రపంచంలో ఏ మూలన నివసిస్తున్న ఎన్నారైలు అయినా ఈ కేంద్రం ద్వారా నేరుగా సేవలు పొందవచ్చు. అకౌంట్ ఓపెనింగ్, చెల్లింపులు, లోన్స్, లావాదేవీలకు సంబంధించిన ఎలాంటి సేవలనైనా జీఎన్సీ ద్వారా 24 గంటలపాటు పొందవచ్చు. ” ఎన్నారైల బ్యాంకు లావాదేవీలు పెరిగాయి. ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, అన్నీ రకాల సేవలను ఎన్నారైలకు టెక్నాలజీ ద్వారా అందించేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. జీఎన్సీ ద్వారా అందించే సేవలతోపాటు ఇతర ఎస్బీఐ సర్వీసులను కూడా ఎన్నారైలు సులభంగా పొందవచ్చు” అని ఎస్బీఐ చైర్మన్ రజ్నిష్ కుమార్ తెలిపారు.













