అమెరికాలో సేవ్ అమరావతి ఉద్యమం
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ ప్రవాసాంధ్రుల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికే అమరావతి దీక్షలు 58వ రోజుకు చేరిన ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడంతో నిరసను ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రవాసాంధ్రులు జేఏసీ ఆధ్వర్యంలో రాయబార కేంద్రం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాన్న డిమాండ్‌తో ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలని ఐకాస చైర్మన్ కె.బుచ్చి రాంప్రసాద్ తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియా హ్యూస్టన్, ఒమాహా, కాన్సస్ సిటీ, పోర్ట్ ల్యాండ్, అట్లాంటా, సెయింట్ ూయిస్, డెట్రాయిస్, బోస్టన్, బాల్టిమోర్, చార్టట్, ర్యాలీ, మిన్నియా పోలీస్, కొలంబస్, డల్లాస్‌లో ప్రదర్శలను నిర్వహించారు. అదే విధంగా లండన్‌లో కూడా ప్రవాసాంధ్రులు అమరావతికి మద్దతుగా నిరసన ప్రదర్శలను చేపట్టారు.













