అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సతీష్ వేమన మిత్రుల ప్రచారం
అమెరికా దేశ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార సభలతో ఉభయ పార్టీలు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ తనదైన శైలిలో సదూసుకుపోతుండగా.. తెలుగు వారు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగు రాష్టాల తరపున “తానా” పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన మరి మిత్రులు కూడ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో చురుకుగా పాల్గొంటూ తెలుగు వారి మద్దుతు కూడగట్టి డోనాల్డ్ ట్రంప్ విజయానికి అవిరళ కృషి చేస్తున్నారు.
అందులో భాగంగా రెండు లక్షల మంది ప్రజలు హాజరైన చారిత్రాత్మకమైన మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి హాజరవ్వటం, ట్రంప్ గెలుపుకు పిలుపునిస్తూ తెలుగు ప్రముఖులైన పరిచయస్తులందరితోనూ సమావేసవుతూ ముందుకు సాగుతున్నారు. నిన్నటి మాడిసన్ స్క్వేర్ గార్డెన్ 1800ల నుండి డెమొక్రాటిక్ మరియు రిపబ్లికన్ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది. ఎలోన్ మస్క్, వివేక్ రామస్వామి మరియు తులసీ గబ్బార్డ్లతో సహా యునైటెడ్ స్టేట్స్‌లోని టాప్ 30 ప్రముఖ వ్యక్తులతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి జెడి వాన్స్‌తో కలిసి సతీష్ వేమన మన పరిమిత ప్రముఖుల గౌరవార్థం ఏర్పాటు చేసిన డిన్నర్ కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా.. కాకతాళీయంగా ..తమ అత్తమామల ద్వారా భారతదేశంలోని కృష్ణా జిల్లాతో మా ఇద్దరికీ సంబంధాలు ఉన్నాయని సతీష్ వేమన మరియు ఉపాధ్యక్ష అభ్యర్థి జెడి వాన్స్ సంభాషించుకోవటం గమనార్హం. రాబోయే రోజుల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున తెలుగు రాష్ట్రాలతో సత్సంబంధాలునెలకొల్పి మరింతగా మేలు జరిగేలా కృషి చేయాలని జెడి వాన్స్, సతీష్ వేమనను అభ్యర్దించారు. అదే విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే విధమైన విధానాలను రిపబ్లికన్ పార్టీ తన ప్రచారంలో ప్రజలకు వివరిస్తోంది. గత కొన్ని రోజులగా ప్రచారంతో పాటు ట్రంప్ మరియి రిపబ్లికన్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడ్డాయి.
ట్రంప్ మరియు జెడి వాన్స్ తో కలిసి రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగుతూ రిపబ్లికన్ పార్టీ విజయానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని అమెరికా భారతదేశ సత్సంబంధాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సతీష్ వేమన తెలిపారు.







