ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన సతీష్ వేమన
తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక, తెలుగువాడి వాడి వేడిని దశదిశలా చాటిన మహనీయుడు అన్న నందమూరి తారకరాముని వర్ధంతినాడు, తెలుగువాడి అభ్యున్నతిని, అభివ ద్ధిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన దార్శనికుడు మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబుగారితో, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆ మహానుభావుడికి నివాళులు అర్పించే కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు సతీష్ వేమన పాల్గొన్నారు. ఆ మహానుభావుడి అడుగుజాడల్లో నడుస్తూ అమెరికాలో కూడా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతానని ఈ సందర్భంగా సతీష్ వేమన పేర్కొన్నారు.













