సతీష్ వేమన సహకారంతో కర్నూలులో 2వేలమందికి అన్నదానం
కోవిడ్ 19 సంక్షోభం, లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను, వలస కూలీలను ఆదుకునేందుకు ఎంతోమంది సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన ఈరోజు కర్నూలులో దాదాపు 2వేల మందికి అన్నదానం చేశారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలాజీ క్యాంటీన్ అధినేత ముప్పారాజశేఖర్ సారధ్యంలో అన్నదానం కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని సతీష్ వేమన స్పాన్సర్ చేశారని, దాదాపు 2,000 మందికి అన్నదానం చేసినట్లు తానా కార్యదర్శి రవి పొట్లూరి చెప్పారు.













