కాలిఫోర్నియాలో శతచండీ యజ్ఞం
లోక కల్యాణం కోసం వచ్చే నెల 1 నుంచి 11 వరకు అమెరికాలో శతచండీ యజ్ఞం నిర్వహించనున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లివర్మోర్లోని శివవిష్టు ఆలయంలో మార్చి 1 నుంచి 11 వరకు అతిరుద్ర, అలాగే మార్చి 1 నుంచి 10 వరకు శతచండీ యజ్ఞాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ మహత్తర యజ్ఞాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శతచండీ యాగం చివరి రోజున శివపార్వతుల కల్యాణం, అతిరుద్ర ముగింపు సందర్భంగా నంది వాహన సేవలో ఈ వేడుకలు ముగుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.













