US: “ఇది చాలా పెద్ద సమస్య. పరిస్థితులు పూర్తిగా తెలుసుకోవడం అవసరం” : సంతోష్ సోమిరెడ్డి, అటార్నీ
సోమిరెడ్డి లా గ్రూప్ సంస్థ గత 7 సంవత్సరాలుగా వాషింగ్టన్ డీసీ లో మెయిన్ ఆఫీస్, అనేక రాష్ట్రాలలో ఆఫీస్ లతో వున్న పేరొందిన లీగల్ ఫర్మ్. ప్రస్తుతం అమెరికాలో విద్యార్థులు వారి F1 వీసా రద్దు చేస్తూ దేశం విడిచి వెళ్ళిపోవాలి అని వస్తున్న నోటీసు ల గురించి మాట్లాడుతూ శ్రీ సంతోష్ సోమిరెడ్డి అనేక విషయాలు తెలిపారు. ఆయన చెప్పిన విషయాలలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ..
పాలస్తీనా కు మద్దతు గా కొన్ని చోట్ల కొందరు విద్యార్థులు చేసిన ప్రొటెస్ట్ అల్లర్లను ఫెడరల్ గవర్నమెంట్ చాలా తీవ్రంగా పరిగణించి ఎట్టి పరిస్థితులలోను అమెరికా లో అలాంటి మద్దతుదార్లను ఉండనివ్వకూడదు అనే దృఢ సంకల్పం తో తీసుకొన్న నిర్ణయమే ఈ నోటీసు లు.
మా ఆఫీస్ కి చాలా మంది విద్యార్థులు కనెక్ట్ అయ్యారు. మా ఆఫీస్ లో అందరూ రాత్రింబవళ్ళు ఈ ఇష్యూ మీద పని చేస్తున్నాం. నేను మొదటి సారి గా వారం రోజుల క్రితమే ONLINE లో ముంచుకొస్తున్న ప్రమాదం గురించి మాట్లాడాను. పొంచి ఉన్న ప్రమాదం ఎంత పెద్దదో తెలుసుకుంటే ఆ ప్రమాద పరిస్థితుల్లో ఏమి చెయ్యొచ్చు అని నిర్ణయం చేసుకోవచ్చు. అయితే ప్రమాదం ఏమీ లేదు అనుకోవడం ఇంకా పెద్ద ప్రమాదం.
ఇప్పుడు నోటీసు వచ్చిన విద్యార్థులకు రెండే దారులు. ఒకటి నోటీసు ప్రకారం అమెరికా వదిలి వెళ్లిపోవడం ( Self Deportation ). రెండవది : Reinstate చెయ్యమని పిటిషన్ వెయ్యడం. మేము ఇప్పటికే చాలా Reinstatement letters ఫైల్ చేసాము. ఒక law suit గూడా ఫైల్ చేసాము.
విద్యార్థులకు నోటీసు లు పంపిన సమయం లోనే ఆ ఏరియా లలో వుండే ICE ( Immigration & Customs Enforcement ) ఆఫీసర్ లకు కూడా సమాచారం ఇచ్చారు. అందు వలన ఆ విద్యార్థులు అరెస్ట్ అయ్యే ప్రమాదం వుంది. ఈ విధం గా ఒక విద్యార్థి దగ్గరకు వచ్చిన ఒక ఆఫీసర్ తో మాట్లాడితే తెలిసిన విషయం – ఆ ఆఫీసర్ లు కూడా అమాయకులను శిక్షిస్తున్నామని తెలుసునని , కానీ మా ఉద్యోగం ప్రకారం మేము మా పని చేస్తున్నాం అని అన్నారు.
గతంలో వేరే కేసు లో పోలీస్ లకు వేలి ముద్రలు ఇచ్చిన విద్యార్థుల విషయం లో ( గతం లో జరిగిన కేసు లో నిర్దోషులు గా బయటకు వచ్చినా సరే !!) ఇప్పటి నోటీసు కేసులలో బయట పడటం కష్టమే ! అలాంటి వారు Reinstatement appeal చేసుకొన్నా , వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ. మామూలుగానే నెలకు ఒక reinstatement కేసు ఫైల్ చేస్తే USIS నుంచి తీర్పు రావడానికి 8- 10 నెలలు పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో వేల సంఖ్య లో అప్పీల్ చేసుకొనే వారికి ఒక్కో కేసులో తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. తీర్పు అనుకూలంగా వచ్చే వరకు ఆ విదార్థి ఏ వుద్యోగం చెయ్యకూడదు. ఎప్పుడైనా అరెస్ట్ అవ్వవచ్చు. అందుకని ఆలాంటి కేసు లు వున్నా విద్యార్థులు ప్రస్తుతం దేశం వదిలి వెళ్లిపోవడమే మంచిది!. మళ్ళీ వీసా తీసుకొని రావదానికి అవకాశం వుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు , లేదా వారి శ్రేయోభిలాషులు ఈ విషయాలన్నీ అర్ధం చేసుకొని ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం !
మేము కూడా ఇప్పటికే ఫైల్ చేసిన Lawsuit ని జడ్జి స్వీకరించి కేసును నడిపే విధానం బట్టి ముందు ముందు అలాంటి కేసు లలో మేము ఏమి చెయ్యాలో నిర్ణయించుకొంటాము. రాబోయే రెండు వారాల్లో అనేక lawsuits ఫైల్ చేయబోతున్నాం.








