మస్కట్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
ఒమాన్ దేశ రాజధాని మస్కట్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని దాటాయి. మున్నెన్నడూ లేని విధముగా భారీ తారలు, వివిధ విభాగాల నిపుణులతో టాలీవుడ్ మొత్తము సంక్రాంతి కి మస్కట్ వచ్చారా అన్నట్టు రెండు రోజులు శోభాయమానంగా వేడుకలు నిర్వహించారు. రాయల్ కింగ్ Holding మరియు చిరు మెగా యూత్ ఫోర్స్ సంయుక్తముగా నిర్వహించిన ఈ వేడుకలు నభూతో నభవిష్యత్ అన్నట్టు అందరినీ అలరించాయి.
ఇటీవల సినీరంగములో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖులు శ్రీ డా. మాగంటి మురళీ మోహన్ గారిని ఘనముగా సన్మానించడము ఓ అద్భుతము గా చెప్పవొచ్చు. ఒమాన్ దేశ చిహ్నం అయిన కంజరి నడుముకు తొడిగి స్వర్ణ కంకణము తో గౌరవించడము ఈ వేడుక లో ప్రధానఘట్టము గా చెప్పవొచ్చు.
హైదరాబాద్ నివాసి మరియు ఇటీవల మస్కట్ లో Royal King Holding తో భాగస్వామ్య వ్యాపారము మొదలు పెట్టిన ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, సినీ పంపిణీదారు మరియు వ్యాపారవేత్త అయిన శ్రీ బుర్ర ప్రశాంత్ గౌడ్ మరియు CMYF వ్యవస్థాపక అధ్యక్షలు అయిన శ్రీ రామదాస్ చందక గారు నిర్వహించారు.
Dr. శ్రీ మురళేమోహన్ గారితో పాటు టాలీవుడ్ నటులు రజిత, మధుమని, పింకీ, సోనియా చౌదరి మరియు టివి నటి సంజన లు సంక్రాంతి వేడుకలకు కొత్త శోభాయమానం తెచ్చారు.
శుక్రవారం సాయంత్రము 5.30 గంటలకు మొదలయిన కార్యక్రమము 12 గంటలు వరుకు ఏకరీతిగా నడిపించిన వ్యాఖ్యాత కుమారి మాధవి రెడ్డి గారి గూర్చి ఎంత చెప్పినా తక్కువే. సింగర్స్ హనుమాన్, స్వాతి సత్యభామ, మోనికా యాదవ్ లు తమతమ గీతాలతో ప్రేక్షుకులును కట్టిపడేసారు. పాటలకు తగ్గ డాన్సులు ఢీ ఫేమ్ గోవింద్ టీమ్ స్టేజి ను దులిపారు.
జబర్దస్త్ సుధాకర్ తన గాలిపటాలు తో హల్ లో వున్నవారిని కడుపు ఉబ్బా నవ్వించాడు, ఉత్తరాంద్ర నుంచి వచ్చిన మరో కళాకారుడు MSR నాయుడు తన వెంట్రిలాక్కుజమ్ నైపుణ్యముతో పిల్లలును అలరించారు. మొత్తము కార్యక్రమానికి మెరుపు లాంటి డాన్స్ తో వచ్చిన నటి ఎస్తేర్ ప్రచ్చేకం.
ఈమారు సంక్రాంతి సంబరాలుకు హైదరాబాద్ నగరము నుంచి ప్రముఖులు GVK Media అధినేత శ్రీ వసంతకుమార్ గౌడ్ గారు, Aadab Hyderabad పబ్లిషర్ శ్రీ సత్యం గారు, శ్రీ శ్రీకర్ గౌడ్ గారు (Ex IRS)మరియు వ్యాపారవేత్త శ్రీ రమేష్ గౌడ్ గారు లు రావడమే కాకున్నా, ఒమాన్ (మస్కట్) లో ఏ రంగాల్లో వ్యాపారము అభివృద్ధి చేయవచ్చో పరిశీలన చేసారు.
ఈ వేడుకల్లో సామాజిక బాధ్యత కొట్టొచ్చినట్టు కనిపించడము విశేషము. 20 మార్లు కు పైగా రక్తదానము చేసిన 30 మంది యువతీయువకులకు, శ్రీ మురళేమోహన్ గారితో సత్కారము చేయించడమే కాకున్నా ఇద్దరు అంబేద్కర్ సేవాసమితి మహిళామణులును Narisena అధినేత శ్రీ లతాచౌదరి గారు శాలువతో సత్కరించడము విశేషము.. అందులో భాగముగా మీడియా రంగానికి విశేష సేవలు అందిస్తున్న శ్రీ రాజేష్ మడకశిర గారికి కూడా మెమొంటో తో గౌరవించడము జరిగింది.
మొత్తము ప్రోగ్రాము కు అన్నిరకాలుగా అండదండలు ఇచ్చిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ వైబ్రాంట్ సంస్థ పెద్దలు మల్లారెడ్డి, రవీంద్ర రెడ్డి మరియు శ్యామ్ సుందర్ రెడ్డి ల తో పాటు CEO శ్రీనివాసరావు లను కూడా గౌరవించి, స్థానికంగా సహాయ సహకారాలు ఇచ్చిన శ్రీ బాలాజీ (టవల్ కంపెనీ) శ్రీ చంద్రశేఖర్, శ్రీ ప్రసాద్ రెడ్డి, శ్రీ నాగభూషణ్ గార్లకు శ్రీ మురళీ మోహన్ గారు పుష్ప గుచ్ఛాలుతో సన్మానము చేశారు.
ఈ మొత్తము కార్యక్రమానికి అన్నీ రకాల అనుమతి తెచ్చిన రాయల్ కింగ్ యజమాన్యము (శ్రీ రెన్నీ జాన్సన్ & టీం) కృషి అబినందనీయము.













